The Desk…Eluru : దండుపాళ్యం బ్యాచ్ కు –  సరైన దండన..!!!

The Desk…Eluru : దండుపాళ్యం బ్యాచ్ కు – సరైన దండన..!!!

  • 2019 గుంటుపల్లి గుహల – గగుర్పొడిచే క్రైమ్ స్టోరీ
  • ఆనాటి ఘటన – క్రైమ్ మూవీని మించి
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
  • ఆ నలుగురికి యావజ్జీవ ఖైదు
  • గుంటుపల్లి గుహల వద్ద ప్రేమికులపై దాడి
  • ప్రియురాలిపై అత్యాచారం – హత్య

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

ఆ నలుగురు కరుడుగట్టిన నేరస్థులు.. నాటు తుపాకులు తీసుకుని పిట్టలను వేటాడుతున్నట్టు నటిస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రేమికుల జంటలపై అదును చూసి పంజా విసిరే కిరాతకులు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కామవరపు కోట మండలం జీలకర్రగూడెం గుంటుపల్లి గుహల వద్ద ఓ ప్రేమ జంటపై దాడి చేశారు.

ప్రియుడిని తీవ్రంగా గాయపరిచి.. ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. నేరం జరిగిన రోజుల వ్యవ ధిలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. కేసు విచారణ పూర్తయిన నేపథ్యంలో ఏలూరులోని పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమా సునంద నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరా లను ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ వెల్లడించారు.

ప్రేమ జంటల్ని బెదిరించి..

ప్రేమికులైన యువతీయువకులు 2019 ఫిబ్రవరి 24న జీలకర్రగూడెం గ్రామంలోని గుంటుపల్లి గుహల వద్దకు వెళ్లి ఏకాంత ప్రదేశంలో ఉన్నారు. నిందితులైన ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రా లకు చెందిన పోతునూరి రాజు అలియాస్ అంకమరావు జి. కొండూరు మండలం మాధవరంలో ఉండేవాడు. ద్వారకాతిరు మల మండలం జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల సోమయ్య, గంగయ్య అలియాస్ గంగ రాజు, కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన కొమరగిరి నాగరాజు కూడా ఆ ప్రాంతంలోనే ఉండేవారు. వీరు నలుగురూ ఏకాంత ప్రదేశాల్లో గడిపే ప్రేమ జంటలను బెదిరించి వారి వద్ద డబ్బులు గుంజడం, కొన్ని సందర్భాల్లో ప్రియుడిపై దాడిచేసి ప్రియురాలిపై అత్యా చారానికి పాల్పడటం.. హత్యలు చేయడంవంటి నేరాలకు పాల్పడుతూ ఉండేవారు.

ఆ రోజు గుంటుపల్లి గుహల వద్ద ఓ ప్రేమ జంట ఏకాంత ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రధాన నిందితుడు అంకమరావు వెళ్లి డబ్బులు ఇవ్వాలని లేకపోతే చంపేస్తానన్నాడు. ప్రియుడు ప్రతిఘటించడంతో అతన్ని దుంగతో కొట్టగా.. మిగిలిన ముగ్గురు గట్టిగా పట్టుకున్నారు. అంకమరావు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం కర్రతో తలపై కొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. అపస్మా రక స్థితిలో ఉన్న ప్రియుడిని అక్కడే వది లేసి నలుగురు పరారయ్యారు.

నిందితుల అరెస్టు.. వేగంగా దర్యాప్తు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అప్పటి చింతలపూడి సీఐ యూజే విల్సన్ దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. అప్పుడే వీరు ఇతర జిల్లాల్లోనూ ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు తెలిసింది.

మృతి చెందే సమయానికి యువతికి 17 సంవత్సరాలు ఉండటంతో పోక్సో కేసు నమోదుచేశారు.అప్పటినుంచి కేసు విచారణ సాగుతోంది. నేరం రుజువు కావడంతో నిందితులు నలుగురికి జీవిత ఖైదు, రూ. 10 వేల జరి మానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన యువకుడికి తగిన నష్టపరిహారం అందించాలని డీఎల్ ఎస్ఏకు లేఖ రాశారు.

www.thedesknews.net