The Desk…Machilipatnam : ప్రాధాన్యతా అంశాలపై నివేదికలు అందించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : ప్రాధాన్యతా అంశాలపై నివేదికలు అందించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు కలిగిన నివేదికను తక్షణమే సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టర్ల సమావేశంలో జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించేందుకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అట్టి సమాచారాన్ని సిద్ధం చేసి వెంటనే అందజేయాలన్నారు.రాబోయే మూడు నెలల్లో జిల్లా పంచాయతీ, మున్సిపల్, ఇరిగేషన్, డ్వామా, గ్రామీణ నీటిపారుదల విభాగం, వ్యవసాయ, మత్స్య, గృహ నిర్మాణం, విద్య, వైద్య ఆరోగ్య తదితర శాఖలు నిర్వహించవలసిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలు సైతం అందించాలని సూచించారు.

సమావేశంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జెడ్పి డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, గ్రామీణ నీటిపారుదల విభాగం అధికారి నటరాజన్, రోడ్లు భవనాలు ముఖ్య కార్యనిర్వహణ అధికారి లోకేష్, డిపిఓ జే అరుణ, డీఈవో పీవిజే రామారావు, డీఎస్ఓ వి పార్వతి, హౌసింగ్ పీడీ వెంకట్రావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారిణి జె జ్యోతి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.