🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు సహచర పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన పరిచయ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ చేతులు జోడించి రాష్ట్రపతి ముర్ముకు నమస్కరించారు.
అనంతరం రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన అల్పాహారం విందులో ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. చివరిగా రాష్ట్రపతి ముర్ముతో సహచర ఎంపీలతో కలిసి మహేష్ కుమార్ గ్రూప్ ఫోటో దిగారు.