🔴 ఏలూరు జిల్లా : కొయ్యలగూడెం : ది డెస్క్ :
మండల విస్తరణాధికారికి పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రం అందించారు. కొయ్యలగూడెం మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్సులకు పని ఒత్తిడి తగ్గించాలని.. పంచాయతీ పరిపాలనతో పాటు సచివాలయ నిర్వహణ, వివిధ సర్వేలు మరియు మీటింగుల వలన కార్యదర్సులు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు.
సెలవు రోజుల్లో కూడా సర్వేల పేరుతో అవిశ్రాంతంగా పనిచేస్తున్నందున అనారోగ్యం, మానసిక ఆవేదనకు గురవుతున్నామని, విస్తరణాధికారి, పరిపాలనాధికారి MPDOకు వినతి పత్రం అందజేసిన కొయ్యలగూడెం మండల పంచాయతీ కార్యదర్శులు.