The Desk…Anusamudram : తొలిసారి విడుదల.. రూ.800 ➖ రూ.900 నాణేలను చూశారా.!!

The Desk…Anusamudram : తొలిసారి విడుదల.. రూ.800 ➖ రూ.900 నాణేలను చూశారా.!!

🔴 నెల్లూరు జిల్లా : అనుమసముద్రం : ది డెస్క్ :

తొలిసారి విడుదల.. రూ.800 ➖ రూ.900 నాణేలను చూశారా.!!*దేశంలో తొలిసారి విడుదలైన రూ.800, రూ.900 నాణేలను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామానికి చెందిన మహ్మద్‌ వాయిస్‌ తెప్పించుకున్నారు.

జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ముంబయి మింట్ ఈ నాణేలను ముద్రించి విడుదల చేసిందని తెలిపారు. 40 గ్రాముల బరువున్న రెండు రకాల నాణేలను వెండితో తయారుచేశారని, ఫిబ్రవరి 20న ఆన్‌లైన్‌లో ఆర్బీఐ వెబ్‌సైట్‌లో విక్రయానికి పెట్టగా కొనుక్కున్నానని, మార్చి 10న తనకు అందాయని అన్నారు. ఇప్పటికే ఆయన వద్ద 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీలు ఉన్నాయి.