ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

నాయీబ్రాహ్మణులకు సంబంధించిన ఈనాం భూముల సమస్యలను పరిష్కరించాలనిరెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఎపి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు కోరారు.
ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయంలోని మంత్రి చాంబర్లో మంత్రి సత్యప్రసాద్ను ఎపి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు కలిసి ఈనాం సర్వీసెస్ మాన్యాల భూములకు సంబంధించిసమస్యలను మంత్రికి వివరించారు. సమస్యలను పరిష్కరించి నాయీబ్రాహ్మణవర్గాలకు న్యాయం చేయాలని కోరారు.
దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎపి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు పేర్కొన్నారు.
కార్యక్రమంలో డైరెక్టర్లు లంకా రత్నారావుతోపాటు మద్దిరాల గంగాధర్, నిడమానూరు రమేష్. యానా పోయేసు, సూరవరపు నాగరాజు, మున్నంగి శివ శేషగిరి లు పాల్గొన్నారు.