The Desk…Eluru : అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లఖ్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

ఏలూరు పట్టణ పరిధిలో జన్మభూమి పార్క్ సమీపంలో రూ. 20.50 లక్షలు ఎంపీ నిధులతో చేపడుతున్న బీసీ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నూతన నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఎంపీ కోటా కింద మంజూరు చేసే రూ.5 కోట్లను దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఐదేళ్లలో దాదాపు రూ.25 కోట్లు ఎంపీ నిధులతో అభివృద్ధి చేపట్టేందుకు వీలుందని ఎంపీ తెలిపారు.

ప్రాధాన్యత క్రమంలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు కేటాయించినట్లు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.