🔴 వైఎస్ఆర్ జిల్లా : ది డెస్క్ :
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రం ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద 100 శాతం రాయితీతో డ్రోన్లను అందిస్తోంది.
సమాజంలో చురుగ్గా పనిచేసే మహిళలను ఎంపిక చేసి.. వారి ద్వారా డ్రోన్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లో పురుగు మందులు పిచికారీ చేసేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా 14 వేల మంది మహిళలను ఈ పథకం కిందకు తేవాలనేది కేంద్రం లక్ష్యం. తొలివిడతలో తెలుగు రాష్ట్రాల నుంచి 200 మందిని ఎంపిక చేశారు. వారిలో వై.ఎస్.ఆర్.జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన జ్యోత్స్న డ్రోన్ పైలట్‌గా ఎంపికై.. శిక్షణ పూర్తి చేసుకున్నారు.