The Desk…Machilipatnam : కృష్ణాజిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్, మెడికల్ క్యాంపులు

The Desk…Machilipatnam : కృష్ణాజిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్, మెడికల్ క్యాంపులు

  • జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2025 వారోత్సవాలు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మహిళ భద్రతే ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో, మార్చి 1వ తేదీ నుండి 7 తేదీ వరకు జరుగు వారోత్సవాలలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓపెన్ హౌస్ మరియు మెడికల్ క్యాంపు నిర్వహించారు.

⏩ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంగణంల లో పాఠశాలల, కళాశాల విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి సమాజంలో మహిళల పాత్ర , మహిళా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యతను, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలకు గురించి అవగాహన కల్పించడం జరిగింది.

⏩ పోలీస్ స్టేషన్ రిసెప్షన్, దాని పనితీరు, కేసు ఏ విధంగా నమోదు చేస్తారు, దాని దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, కమ్యూనికేషన్ వ్యవస్థ యొక్క పనితీరు, ఉమెన్ హెల్ప్ డెస్క్, మహిళల భద్రతకు ఏ విధంగా పనిచేస్తుంది, మహిళలకు ఉండే హక్కులు వారికి గల ప్రత్యేక చట్టాల గురించి తెలియజేయడం జరిగింది.

⏩ మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్ అండ్ బాడ్ టచ్, సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న నేరాలు, వాటి నుండి తప్పించుకోవడానికి ఏ విధంగా జాగ్రత్త పడాలి, వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

⏩ విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారికి ఉన్న సందేహాలను పోలీసు అధికారులను అడిగి వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

⏩ అలాగే వారికి ఏదైనా సమస్య ఉంటే ఏ విధంగా పోలీసు వారిని సంప్రదించాలో కూడా అడిగి తెలుసుకున్నారు.

⏩. మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందికి జిల్లా పోలీస్ యూనిట్ హాస్పిటల్ నందు వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహించి అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అవసరం మేరకు వారికి మందులు కూడా అందజేయడం జరిగింది.