The Desk…Bhimadole : తడిచెత్త – పొడిచెత్త పై అవగాహన కార్యక్రమం… డోర్ టు డోర్

The Desk…Bhimadole : తడిచెత్త – పొడిచెత్త పై అవగాహన కార్యక్రమం… డోర్ టు డోర్

ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ :

తడిచెత్త – పొడిచెత్త సేకరణలో భాగంగా.. ఇంటింటికి విస్తృత ప్రచారం చేస్తూ…

ఈ సందర్భంగా భీమడోలు గ్రామ కార్యదర్శి తనూజ “చెత్త” విషయమై గ్రామస్తులకు వివరిస్తూ..

ఏదైతే కుళ్ళిపోయి భూమిలో మిళితమైపోతాయో అవన్నీ తడిచెత్తకు సంబంధించినవని.. ఉదాహరణకు అన్నం , కూరగాయల తుక్కు , వగైరా తడిచెత్తకు చెందినవని..

ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, చాక్లెట్ పేపర్లు , వైర్లు, సూదులు వగైరా పొడి చెత్తకు సంబంధించినవని…

పొడిచెత్తకు సంబంధించినవి సెపరేట్ గా ఒక కవర్లో ఉంచుకోవాలని, అవి కుళ్లి పోయేవి, వాసన వచ్చేవి కాదు కాబట్టి.. రెండు మూడు రోజులకు ఒకసారి ఖచ్చితంగా మా సిబ్బంది వచ్చి పట్టుకు వెళ్తారని..

తడిచెత్త అయితే దుర్వాసన వస్తుంది కాబట్టి రోజు విడిచి రోజు వచ్చి తడిచెత్తను మా సిబ్బంది ఖచ్చితముగా తీసుకువెళ్తారని..

అలా తీసుకువెళ్లిన చెత్తను SWM షెడ్డునకు తరలించి సేంద్రియ ఎరువుగా తయారు చేసి మొక్కలకు, పొలాలకు అతి చౌకైన ధరలో తిరిగి కావాలంటే మీకే అందిస్తామని భీమడోలు గ్రామపంచాయతీ కార్యదర్శి తనూజ ప్రతి గృహాన్ని దర్శించి మహిళలకు తడిచెత్త – పొడిచెత్త పై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భీమడోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి తనూజ సచివాలయ కార్యదర్శి హేమ సుందర్ , రఘునాథ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.