The Desk…Bhimadole : ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించండి ➖ MP మహేష్ పుట్టా విజ్ఞప్తి

The Desk…Bhimadole : ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించండి ➖ MP మహేష్ పుట్టా విజ్ఞప్తి

ఏలూరు జిల్లా : భీమడోలు :THE DESK NEWS :

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఏలూరు జిల్లా భీమడోలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఓట్లు అభ్యర్థించారు.

మాంటిస్సోరీ విద్యా సంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలును ఎంపీ మహేష్ కుమార్ వివరించారు.