The Desk… Machilipatnam : పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవాసంస్థల పాత్ర ప్రశంసనీయం :  జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk… Machilipatnam : పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవాసంస్థల పాత్ర ప్రశంసనీయం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : మంగినపూడి బీచ్ : THE DESK NEWS :

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రతను బాధ్యతగా చేపట్టిన దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థ ఏఎస్ఈజెడ్ కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.

బుధవారం ఉదయం సంస్థ ప్రతినిధులు వాలంటీర్లతో కలిసి మంగినపూడి బీచ్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు సాయంత్రం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ను కలిసి సంస్థ లక్ష్యాలను వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్ర తీరాలలో కాలుష్య రహితానికి సంస్థ చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పర్యాటకశాఖ జిల్లా అధికారి జి.రామలక్ష్మణరావు, సంస్థ ప్రతినిధులు విలియం, ప్రేమ్ కుమార్, దక్షిణ కొరియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తదితరులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.