- వక్ఫ్ బోర్డు ది అంటూ మసీద్ కమిటీ కాదని నివాసితుడు వెల్లడి..
- ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట..
- ఉద్రిక్త వాతావరణం పోలీసుల జోక్యం తో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు జిల్లా ఏలూరు గన్ బజార్ పెన్షన్ మహల్లా మసీద్ సమీపంలో ఓ ఇంటి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పెన్షన్ మహల్లా మసీద్ కమిటీ వారు ఆ స్థలం తమ మసీదుకు చెందుతుందని వక్ఫ్ బోర్డు గెజిట్లో ఉందని పేర్కొంటున్నారు. ఆ ఇంట్లో ఉంటున్న వారు తాము కోర్టులో గెలిచామని ఇంజక్షన్ ఆర్డర్ ఉందని ఇంటికి మరమ్మత్తు చేసుకుంటుండగా మసీదు కమిటీ వారు వచ్చి నిలిపి వేస్తున్నారని తెలిపారు.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నింద ఆరోపణలు చేసుకొని స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎవరిని సముదాయించి ఏమైనా వివాదం ఉంటే కోర్టులో చూసుకోవాలని ఇక్కడ ఎటువంటి దాడులకు పాల్పడితే సహించలేదు అని ఇరువురిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే…
మసీద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ నజీర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరి మహిళ అయినా మహబూబ్ ఉనిసా బేగం కు మానవతా దృక్పథంతో తమ మసీద్ కమిటీ పూర్వికులు ఆ స్థలాన్ని ఆవిడకి నివాసం ఉండడానికి ఇచ్చారన్నారు. ఆవిడ అనారోగ్యానికి పాలైన చివరి రోజుల్లో బంధువులు తమ ఊరికి తీసుకుని వెళ్లి ఆవిడ చనిపోయిన తర్వాత ఖనన కార్యక్రమాలు చేసేసి ఒక దొంగ వీలునామా తీసుకువచ్చి ఆ 170 గజాల ఇంటి ని తమదే అని వాగ్వాదానికి దిగుతున్నారని అన్నారు. ఆ ఇల్లు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని ఇంటి మరమతుల పనులు వెంటనే నిలిపి వేయాలని పోలీసులను కోరారు.
ఈ ఇల్లు తన మేనత్త (లేటు) మెహబూబ్ ఉనిసా బేగంది అని షేక్ అబ్దుల్ రౌఫ్ అంటున్నారు. మసీద్ కమిటీ వాళ్ళు ఇచ్చింది కాదని పూర్వజిత ఆస్తిగా ఆయన పేర్కొంటున్నారు పన్ను, కరెంటు బిల్లు కడుతున్నామని మూడువ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కం స్పెషల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మొబైల్ కోర్టులో ఈ అంశంపై దావా దాఖలు చేశానని తెలిపారు. తనకు అనుకూలంగా గత నెల 30వ తేదీన తీర్పు లో భాగంగా మధ్యంతర ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని అన్నారు. అందులో ఇంటి రిపేర్ వర్క్స్ చేసుకోవచ్చని తెలిపారు అన్నారు మసీదు కమిటీ వాళ్ళు వచ్చి పనులను నిలిపివేయాలని తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఇది వక్ఫ్ బోర్డు స్థలం కాదని వాపోయారు.
వక్ఫ్ బోర్డ్ ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ కే. అలీమ్ ఘటన స్థలానికి చేరుకొని ఈ ఇల్లు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని ఇక్కడ ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకూడదని అన్నారు. ఇంటి మరమ్మత్తులు చేపడుతున్న వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కోర్టు నుండి తీసుకువచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ చెల్లదని వెంటనే మరమ్మత్తులు పనులు నిలుపుదల చేయాలని షేక్ అబ్దుల్ రౌఫ్ కు తెలిపారు.