The Desk…Eluru : ఫస్ట్ అవర్ – గోల్డెన్ అవర్ : (➖ జిల్లా ఎస్పీ)

The Desk…Eluru : ఫస్ట్ అవర్ – గోల్డెన్ అవర్ : (➖ జిల్లా ఎస్పీ)

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మొదటి గంటలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడగలమని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివకిశోర్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగముగా ఉప రవాణా కమిషనరు వారి కార్యాలయములో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదానం శిభిరాన్ని ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ…రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మొదటి గంట సమయం చాలా ముఖ్యమైనదని, దీనిని గోల్డెన్ అవర్ అంటారన్నారు. ఆ సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాలు రక్షించవచ్చని, క్షతగాత్రున్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లిన వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి కేసు నమోదు చేయమన్నారు.

ప్రాణాలను రక్షించిన వారికి రివార్డులు అందించడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఇటీవల కైకలూరులో ఆటో డ్రైవర్ తన భార్యాపిల్లలను కొత్త ఆటో నుంచి దింపేసి, రహదారి ప్రమాద క్షతగాత్రులను తన ఆటోలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను రక్షించగలిగారని తెలిపారు. ప్రతిఒక్కరు ఇటువంటి వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.

కొత్త చట్టాల ప్రకారం రహదారి ప్రమాదాలకు గురైన వారికి ఆసుపత్రుల్లో కొన్ని లక్షల రూపాయల పైనే వైద్యము ఉచితముగా అందించే వెసులుబాటు ఉందని తెలిపారు. వీటిపై రవాణా మరియు పోలీస్ శాఖలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాని అన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

మైనర్లకు మోటారు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ రక్త దాన శిభిరం ద్వారా రక్తాన్ని దానం చేసిన ప్రతిఒక్కరిని ఎస్పీ అభినందించారు. తదనంతరము డీటీసీ కార్యాలము ఆవరణములో ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్, ఆర్టీవోలు కె.ఎస్.ఎం.వి.కృష్ణారావు, ఎండి, మదానీ, డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు రూరల్, ఎస్.బి. సీఐలు తో కలిసి అయన మొక్కలను నాటారు.

ఈ రక్త దాన శిబిరంలో 20 మందికి పైగా రక్తాన్ని అందినగా, వారితో పాటుగా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండి, మదానీ మరియు ఏలూరు కార్యాలయ సిబ్బంది రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ పీఆర్వో శ్రీనివాస్ ఆధ్వర్యములో విద్యాధికారి మరియు ఆరుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం సహాయసహకారాలు అందించారు.

కార్యక్రమములో పరిపాలన అధికారులు ఎం.రాము, ఎం. ఆనంద్ కుమార్, వాహన తనిఖీ అధికారులు ఎస్.డి. విఠల్, ఎండి. జమీర్, అజ్మీరా బద్దు, కళ్యాణి, నరేంద్ర బాబు, ప్రజ్ఞ, పాల్గొన్నారు.