దిల్లీ/ఏలూరు : THE DESK NEWS :
ఏపీలో ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో గత ఐదేళ్లలో రిజిస్టర్ చేసుకుని ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలు ఖర్చు చేసిన సిఎస్ఆర్ నిధుల వివరాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఏలూరు జిల్లాతో సహా ఏపీలో మొత్తం 15,635 కంపెనీలు పనిచేస్తున్నాయని, 2018-19 నుండి 2022- 23 ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.3707.43 కోట్లు సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి బదులిచ్చారు.
మొత్తం 25 విభాగాలకు ఈ నిధులు కేటాయించగా, వాటిలో విద్యారంగానికి రూ.734.68 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1050.49 కోట్లు, జీవనోపాధి మెరుగుదలకు రూ. 237.43 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.706.47 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.