🔴 అనకాపల్లి జిల్లా : చోడవరం : అంకుపాలెం : ది డెస్క్ :
బామ్మ వయసు 86.. ఈ వయసులో జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యం ఉండమే స్ఫూర్తినిచ్చే అంశం.
జాతీయ స్థాయి పోటీలకు కేరళకు వెళ్లగా కుమారుడికి గుండెపోటని సమాచారం పట్టుదలతో 2 బంగారు పతకాలు కైవసంబామ్మ వయసు 86.

గుంటూరు పోటీల్లో డిస్కస్‌త్రో విసురుతున్న లక్ష్మి..
ఈ వయసులో జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యం ఉండమే స్ఫూర్తినిచ్చే అంశం. తీరా అక్కడకు వెళ్లేసరికి కన్నకొడుక్కి గుండెపోటని తెలిస్తే..? ఎవరైనా వెనక్కు వచ్చేస్తారు. కానీ అనకాపల్లి జిల్లా చోడవరం శివారు అంకుపాలెంకు చెందిన ముత్యం లక్ష్మి (86) అలా కాదు. ఆ బాధను దిగమింగుకుని పతకాలు సాధించారు. లక్ష్మి గత నెలలో అనకాపల్లి, గుంటూరులో జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్-2025 పోటీల్లో రాణించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన ఆ పోటీల్లో పాల్గొనేందుకు స్థానికుల ఆర్థిక సాయంతో గత నెల 29న కేరళ బయలుదేరి వెళ్లారు. పోటీలు ప్రారంభమైన రోజే లక్ష్మి రెండో కుమారుడు గుండెపోటుతో ఆసుపత్రి పాలవగా కుటుంబసభ్యులు ఈ విషయం తల్లికి చెప్పి తిరిగొచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేస్తామన్నారు.
ఈ వయసులో విమాన ప్రయాణం వద్దని వైద్యులు సూచించడంతో విరమించుకున్నారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని మనసులోనే ఉంచుకుని పోటీల్లో పాల్గొన్న లక్ష్మి షాట్‌పుట్‌లో రజతం సాధించారు. ఒకటి, రెండో తేదీల్లో జరిగిన జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు అనే అందుకున్నారు.
రిజర్వేషన్ దొరక్క 2 రోజులు అక్కడే ఉండిపోయిన లక్ష్మి.. గురువారం బయలుదేరి శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు. నేరుగా కేజీహెచ్‌కు వెళ్లి కోలుకుంటున్న కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.