The Desk…Eluru : ఏపీలో నదుల అనుసంధానం ప్రాజెక్టులు అమలు దశకు చేరుకోలేదు : మంత్రి రాజ్ భూషణ్ చౌదరి

The Desk…Eluru : ఏపీలో నదుల అనుసంధానం ప్రాజెక్టులు అమలు దశకు చేరుకోలేదు : మంత్రి రాజ్ భూషణ్ చౌదరి

దిల్లీ/ఏలూరు : THE DESK NEWS :

ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, గత ఐదేళ్లలో కేటాయించిన నిధులు, ఖర్చుపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి గురువారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

నదుల అనుసంధానికి భారత ప్రభుత్వం జాతీయ దృక్పథ ప్రణాళికను రూపొందించిందని, నదుల అనుసంధానం నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నదుల అనుసంధానం ఏ ఒక్క ప్రాజెక్ట్ అమలు దశకు చేరుకోలేదని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల పరిధిలోని మహానంది (మణి భద్ర), మహానది (బార్ముల్), రుషికుల్య, (గోదావరి) లింక్ ప్రాజెక్ట్, ఏపీ పరిధిలోని గోదావరి (పోలవరం), కృష్ణా (విజయవాడ) లింక్ ప్రాజెక్ట్, కృష్ణా (నాగార్జునసాగర్), పెన్నార్ (సోమశిల) లింక్ ప్రాజెక్ట్, ఎఫ్.ఆర్ పూర్తి అయిందని, ప్రత్యామ్నాయ కృష్ణా (నాగార్జునసాగర్), పెన్నార్ (సోమశిల) లింక్ ప్రాజెక్ట్ డిపిఆర్ పూర్తయిందని, కృష్ణా (శ్రీశైలం), పెన్నార్ లింక్ ప్రాజెక్ట్ డ్రాఫ్ట్ డి పి ఆర్ పూర్తయిందని, పేన్నార్ (సోమశిల) కావేరి లింక్ ప్రాజెక్ట్ డిపిఆర్ పూర్తయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధాన ప్రాజెక్టుల నిర్మాణానికి 20 21- 22 లో రూ.4644.46 కోట్లు బడ్జెట్ లో కేటాయించగా రూ.4639.46 కోట్లు ఖర్చు చేశారని, 2022- 23లో రూ.1400 కోట్లు కేటాయించగా రూ. 622.42 కోట్లు ఖర్చు చేశారని, 2023 -24 లో రూ.3,500 కోట్లు కేటాయించగా రూ. 1392.37 కోట్లు ఖర్చు చేశారని, 2024- 25లో రూ.4 వేల కోట్లు కేటాయించగా 2024 డిసెంబర్ 31 వరకు 1369.12 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 డిసెంబరు 31 వరకు 8023.37 కోట్లు వెచ్చించిందని, రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ అమలు ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని, కేంద్ర మద్దతుతో రూ. 39,317 కోట్లతో ఈ ప్రాజెక్టులను 2030 మార్చి నాటికి పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి బదులిచ్చారు.