🔴 అమరావతి/సచివాలయం : ది డెస్క్ :
పోలవరం ప్రాజెక్టు సంబంధించిన 41.5 కాంటూర్ లెవెల్ గ్రామస్తులకు ప్యాకేజీ నిధుల అకౌంట్స్ లో జమ అయిన విషయం పాఠకులకు తెలిసిందే..
అవే కాకుండా 45 కాంటూర్ లెవల్లో ఉన్న గ్రామస్తులకు కూడా ప్యాకేజీ నిధులు మంజూరు చేయాలని.. అలాగే పోలవరం నియోజకవర్గం మొత్తం 90km మేర BT రోడ్డు కొరకు, నియోజకవర్గం అభివృధి కొరకు పోలవరం శాసనసభ్యులు చిర్రిబాలరాజు ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిసి వివరించడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన సిఎం, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గురించి అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే బాలరాజుకు తగు సూచనలు చేశారు.