The Desk…Unguturu : SSC స్టూడెంట్స్ కు మోడల్ పేపర్స్ బహుకరించిన పూర్వ విద్యార్థి

The Desk…Unguturu : SSC స్టూడెంట్స్ కు మోడల్ పేపర్స్ బహుకరించిన పూర్వ విద్యార్థి

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ న్యూస్ :

పెదనిండ్రకొలను శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు బహుకరించారు.

2017లో ఇదే పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసి, ప్రథమ స్థానం సాధించిన పూర్వ విద్యార్థి నిప్పులేటి బిందు నాగదుర్గ తన చిన్నప్పటి బడికి గుర్తుగా ₹7,000 విలువైన అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్లను పుస్తకంగా రూపొందించి పాఠశాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చింతలపాటి బాసిరాజు, వంగ రఘు, నిప్పులేటి కుమార్ స్వామి, అలాగే స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే ఈ మోడల్ పేపర్లు పరీక్షలకు మరింత సన్నద్ధంగా ఉండేందుకు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు.