The Desk…Jangareddigudem : చిన్నారులపై మారుటి తండ్రి దాడి ఘటనలో చలించిన కలెక్టర్

The Desk…Jangareddigudem : చిన్నారులపై మారుటి తండ్రి దాడి ఘటనలో చలించిన కలెక్టర్

చిన్నారులను అక్కున చేర్చుకున్న జిల్లా కలెక్టర్ సెల్వి

🔴ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

చిన్నారులపై మారుటి తండ్రి జరిపిన పాశవిక దాడి చూసి కలెక్టర్ కె వెట్రిసెల్వి చలించిపోయారు. వారికి విద్య, వైద్యం, అందించేందుకు. ముందుకు వచ్చారు. ఏలూరుకు తీసుకువచ్చిన పిల్లలను అక్కున చేర్చుకుని వారిలో మనోధైర్యం నింపే విధంగా మాట్లాడారు. గత ఆదివారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అన్నా చెల్లెళ్లను మారుటి తండ్రి చిత్రహింసలు గురి చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స చేశారు..

ఈ దుస్సంఘటనలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వారికి మంచి ట్రీట్మెంట్ అందించేటట్టు చేశారు. పూర్తిగా స్వస్తులైన వారిని బుధవారం డిశ్చార్జి చేశారు. విషయం తేలిసి కలెక్టర్ కె.వెట్రిసెల్వి వెంటనే మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి శారద డిసిపిఓ సూర్యచక్రవేణిని జంగారెడ్డిగూడెం హాస్పిటల్ కి వెళ్లి పిల్లల్ని తీసుకువచ్చి సిడబ్ల్యుసి వారి ముందు హాజరు పరిచాలని ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారతాధికారి పి శారద ,జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి వెళ్లి ప్రొసీజర్లన్నీ కంప్లీట్ చేసి మెడికల్ గాను, పోలీసువారి ద్వారాను అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఏలూరులోని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ని కలిశారు.ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆ పిల్లల్లో మనోధైర్యాన్ని నింపి వారితో చాలాసేపు సంభాషించి, జరిగిన విషయం అంతా వివరంగా తెలుసుకున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలన్నారు.

పెద్దయ్యాక ఏమవుతారని పిల్లలను కలెక్టర్ అడిగి తెలుసుకుని వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, వారికి ఏది అవసరమైన అన్ని తానుగా చూస్తానని భరోసా ఇచ్చారు.అదేవిధంగా ఈ సంఘటన తెలిసి స్పందించిన హృదయాలను, ఫైనాన్షియల్ గా సహాయం చేస్తామని చాలామంది ముందుకు రావడం జరిగిందని, దానికి కలెక్టర్ జంగారెడ్డిగూడెం ఆర్టిఓను పిల్లలకు గార్డియన్ గా పెట్టి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.

దానిలో ఇప్పటివరకు 5 వేలు చొప్పున ఒకరు, 20,000 మరొకరు, 1500 ఒకరు ఈ విధంగా ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. పిల్లలు భవిష్యత్తుకి అవసరమైన చదువుని అందించడానికి కలెక్టర్ బాధ్యత తీసుకుంటానని పిల్లలకు ఎప్పుడు ఏమి అవసరమైనా వెంటనే తనని సంప్రదించవచ్చని భరోసా కల్పించారు పిల్లల్ని పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అనగా ఉదయ్ రాహుల్ అయితే పోలీస్ అవుతానని రేణుక డాక్టర్ అవుతానని చెప్పారు .

వారు ఇప్పటినుంచి బాగా యాక్టివ్ గా ఉండి పౌష్టికాహారం తీసుకుంటూ,బాగా చదువుకుంటే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సహకరిస్తారని వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి వారికి మరింత మనోధైర్యాన్ని కల్పించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వారు ఎక్కడ షెల్టర్ చేస్తే అక్కడ రిహాబిలిటీ చేయమని పిడి, ఐసిడిఎస్ శారద ను ఆదేశించారు .వెంటనే వారిని అక్కడినుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ముందు హాజరు పరిచారు కమిటీ స్థానిక లైసెన్స్ పొందిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నందు ఈ బాలబాలికలిద్దరికీ వసతి కల్పించారు. అక్కడే ఉండి వారు చదువు కొనసాగించడానికి వైద్యపరంగా వారికి ఏ అవసరమైన వెంటనే అటెండ్ అవ్వమని హోం సూపరింటెండెంట్ ను అదేశించారు.

ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, జంగారెడ్డిగూడెం సిడిపిఓ బ్యూలా, జంగారెడ్డిగూడెం ఏరియా జి ఎం ఎస్ కే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆదివారం నుండి ఈరోజు వరకు కూడా దగ్గరుండి అమ్మలా లాలించిన స్థానిక అంగన్వాడీ టీచర్ లీలారాణి తదితరులను కలెక్టర్ అభినందించారు.