🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరులో హెల్మెట్, వాహనాలకు సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర హెచ్చరించారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల వద్ద మంగళవారం మోటారు వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హెల్మెట్, వారణాలకు సరైన పత్రాలు లేని 30 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి అపరాధరుసుము వసూలు చేసినట్లు చెప్పారు.
ప్రమాద సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను వాహనదారులకు తెలియజేసారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రజ్ఞ, ప్రభృతులు పాల్గొన్నారు.