🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు : ది డెస్క్ న్యూస్ :
ప్రత్తి పాడు సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిరంతరం సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. జనావాస ప్రాంతాల్లోను, పరిసరాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా పోలీసు అధికారులకు నేరుగా తెలియజేయవచ్చన్నారు.
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్తిపాడు సీఐ 94407 96530, ప్రత్తిపాడు SI 94407 96570, అన్నవరం ఎస్సై 94407 96571, ఏలేశ్వరం ఎస్సై 94409 04835, రౌతులపూడి ఎస్ఐ 94407 96552 ఫోను చేయవచ్చన్నారు. 112కు డయల్ చేసి సహాయం పొందవచ్చు అన్నారు.
సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్లు, వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీని తెలియజేయవద్దని, సైబర్ నేరాల నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే సమయంలో ఇళ్లలోను, బీరువా ల్లోను విలువైన బంగారం, నగదు ఉంచొద్దన్నారు.
బ్యాంకుల్లోను, బంధువుల వద్ద భద్రపరుచుకోవాలని, ఊరెళ్తున్న విషయాన్ని దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. ప్రజలు ఇళ్ల వద్ద, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరస్తులను గుర్తించడంలో తోడ్పాటునందించినట్టు అవుతుందని సీఐ సూర్య అప్పారావు మీడియాకు తెలిపారు.