ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా, ఏలూరు : THE DESK NEWS :
రోడ్డు భధ్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు.

ఈ సందర్బంగా హెల్మెట్ లేకుండా బైక్ లపై వెళ్ళుతున్న ద్విచక్ర వాహనదారులను స్వయంగా ఆపి హెల్మెట్ ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను వివరించి వారికి హెల్మెట్లను అందజేశారు.

ఏలూరు కొత్త బస్టాండ్, జూట్ మిల్లు, పాత బస్టాండ్ ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా బైక్ లపై వెళ్ళుతున్న
వారిని గుర్తించి హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని హితవు పలికారు. హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంతమాత్రం భావించవద్దని సూచించారు.

ఈ సందర్బంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వాహనచోధకుల వివరాలను తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని మొదట హెచ్చరికతో వదులుతున్నామని ఇకపై ఖచ్చితంగా అపరాధ రుసుం విధించబడుతుందని హెచ్చరించారు.