- మానవ దృక్పధంతో సాయం అందించిన అంబుల వైష్ణవి
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK NEWS :
మండలంలోని విశ్వనాధుని పాలెం గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన యిండురు వేంకటేశ్వరరావు (52) గత నెల ముందు వారం వ్యవధిలో వెంకటేశ్వరావు భార్య, తల్లి, మృతిచెందారు. అనంతరం వెంకటేశ్వరావు అనారోగ్య సమస్యతో బాధపడుతు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.
విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి స్పందించి ఆర్థిక సహాయాన్ని చెయ్యాలి అంటు తమ తండ్రికి తెలియజెప్పగా.. వెంటనే మనోజ్ ఘటన స్థలాన్ని చేరుకుని వెంకటేశ్వరావు యొక్క మృత దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటేశ్వరావు కు యిద్దరు కుమారులు అయినసాయి ,బాలకృష్ణ ను పరామర్శించారు.