The Desk… Machilipatnam : గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం : జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ

The Desk… Machilipatnam : గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం : జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS :

వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలని.. క్షేత్రస్థాయి తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ, అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967 కు ఫిర్యాదు చేయొచ్చని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు.

దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అట్లు వసూలు చేసిన పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు పంపిణీదారుల పై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అటువంటి గ్యాస్ పంపిణీ ఏజన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సులను రద్దు చెయ్యడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ హెచ్చరిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

దీపం-2 పథకము ద్వారా అర్హులైన ప్రతి వినియోగదారునకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుచున్నదని తెలిపారు.ఈ పథకంలో అమలులో భాగంగా LPG డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఇంటి వద్ద సిలిండర్ లు సరఫరా చేయు సమయములో వినియోగదారుల నుండి నిర్ణీత మొత్తం కంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయని పౌరసరఫరాల కమీషనర్ వారు తెలియజేశారన్నారు.

ఈ విషయమై జిల్లాలోని వివిధ గ్యాస్ పంపిణీదారులు మరియు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎట్టి పరిస్థితులలోనూ గ్యాస్ వినియోగదారుల రశీదులో ముద్రించి ఉన్న ధరను మించి, గ్యాస్ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయరాదని స్పష్టం చేసినట్లు తెలిపారు.

అలాగే, పౌర సరఫరాల సిబ్బందిని మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సిల్స్ అధికారులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, గ్యాస్ పంపిణీదారులు మరియు డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించడం జరిగినదన్నారు.

అలాగే, గ్యాస్ వినియోగదారులు, వారికిచ్చిన రశీదులో ముద్రించి ఉన్న ధర కంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ విధముగా కాకుండా లబ్దిదారుల నుండి గ్యాస్ ఏజన్సీలు అదనంగా డబ్బులు వసూలు చేసినట్లయితే, వినియోగదారుడు సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సేల్స్ అధికారికి, మండల తహశీల్దార్/ పౌర సరఫరాల ఉప తహశీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారి వారికి ఫిర్యాదు చేయవలసినదిగాను లేదా టోల్ ఫ్రీ నెం.1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

వినియోగదారులకు LPG సిలిండర్లను ఎటువంటి ఆటంకం లేకుండా పంపిణీ చేయాలని, ఈ పథకములో ఎటువంటి అవకతవకలు జరిగినా బాధ్యులైన LPG డిస్ట్రిబ్యూటర్స్ మరియు డెలివరీ బాయ్స్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.