The Desk…Bidar : ఇంటి పైకప్పు పై పడ్డ భారీ వాతావరణ అధ్యయన పరికరం

The Desk…Bidar : ఇంటి పైకప్పు పై పడ్డ భారీ వాతావరణ అధ్యయన పరికరం

భారీ శబ్దంతో భయాందోళనకు గురైన స్థానికులు..

కర్ణాటక : బీదర్ జిల్లా : THE DESK NEWS :

కర్ణాటక – బీదర్ జిల్లాలోని జలసంగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు పైన ఓ భారీ బెలూన్ పడింది.

అందులో ఓ భారీ వాతావరణ అధ్యయన పరికరం ఉండటం.. అలాగే రెడ్ లైట్ ఒకటి వెలుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.

పరికరంలో ముందుగా అందులో ఉంచిన లెటర్ ద్వారా ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR)-హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు బీదర్ పోలీసులు గుర్తించారు.

బెలూన్‌ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని.. దాని కారణంగా ఎలాంటి నష్టం కలుగలేదని స్థానిక పోలీసులు తెలిపారు.