యువత చెడు వ్యసనాలకు లోనవ్వకుండా.. పోలీసులు నిర్వహిస్తున్న క్రీడాపోటీలలో పాల్గొనీ.. సంతోషకర వాతావరణంలో రానున్న సంక్రాంతి పండుగను జరుపుకోవాలని శాసనమండలి సభ్యుడు జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు లు హితవుపలికారు. ఈ సందర్భగా వారు పోలీసులను అభినందించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాపెశివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయ క్రీడలపట్ల యువతను ప్రేరేపించే విధంగా కైకలూరు వైవిఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో కైకలూరు టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సోమవారం శాసనమండలి సభ్యుడు జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు లు ప్రారంభించారు.
కైకలూరు టౌన్ సర్కిల్ సిఐ పి కృష్ణ, కైకలూరు రూరల్ సర్కిల్ సిఐ వి.రవికుమార్. కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకట్ కుమార్లతో కలిసి పోటీలు ప్రారంభించిన జయమంగళ, కమ్మిలి లు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో యువత … కోడి పందేలు, పేకాట వంటి వ్యసనాలకు వైపు వెళ్లకుండా ఉండేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. జయమంగళ వెంకటరమణ, కమ్మిలి విఠల్ రావు రావు, కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐ వెంకట్ కుమార్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
కార్యక్రమంలో ఎన్డీఎ కూటమి నాయకులు బికెఎం నాని. పూల రామచంద్రరావు (రాజీ), కొల్లి వరప్రసాద్ (బాబీ), పిజెఎస్ మాల్యాద్రి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీలత, టిడిపి నాయకులు ఎండి జానీ, కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.