The Desk…Kochherla : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి : డా. సేవా బాబూరావు

The Desk…Kochherla : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి : డా. సేవా బాబూరావు

ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK NEWS :

కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ.. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడు డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు సూచించారు. శుక్రవారం మండలానికి చెందిన కొచ్చర్ల గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాబూరావు పాల్గొన్నారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. కలిదిండి మండలం మాల మహానాడు అధ్యక్షుడుగా భూపతి సోమేశ్వరరావు కుమారుడు భూపతి అశోక్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశామన్నారు. మండల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అశోక్ కులమత భేదం లేకుండా మండలంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీస్ అందరికీ అండగా ఉండాలని.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని బాబురావు సూచించారు.

భూపతి అశోక్ మాట్లాడుతూ.. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా మా అధ్యక్షులు బాబురావు చెప్పిన విధంగా కలిదిండి మండలంలో ఉన్నటువంటి అన్ని దళిత గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసి దళితులకు అండగా ఉంటానని.. రాజకీయ పార్టీలకు అతీతంగా దళితులందరూ ఐక్యమత్యంతో ఉండేవిధంగా.. దళితులపై ఎటువంటి దాడులు జరిగిన.. దళిత పక్షం నిలబడి న్యాయం చేస్తానని.. మీ అందరూ సమక్షంలో హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మహానాడు ఉపాధ్యక్షులు దాకరపు జ్యోజిబాబు, భూపతి సత్యానందం, తేరా సుందర్రావు, పాము ఎసయ్య, లంకపల్లి సుదర్శన్ , కురెళ్ళ పవన్, కొచ్చర్ల అంబేద్కర్ యూత్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.