🔴 అమరావతి : THE DESK NEWS :
CM చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. భారీ భద్రత, బందోబస్తుకు దూరంగా ఉంటున్నారు.
సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసరి ప్రాంతాల భద్రత పర్యవేక్షణను పోలీసులు చేపట్టారు.తక్కువ మంది సిబ్బంది, టెక్నాలజీ సాయంతో ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో అత్యాధునిక డ్రోన్‌ను ఏర్పాటు చేశారు.
ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోను షూట్ చేస్తుంది.
సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఏవిధమైన మూమెంట్ కనిపించినా.. కొత్త, అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీమ్‌కు మెసేజ్ పంపుతుంది.
సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటోపైలట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్లీ వచ్చి నిర్దేశిత డక్‌పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది.
ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రజలు, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని సీఎం చంద్రబాబు ఎన్ని సార్లు ఆదేశించినా.. ప్రొటోకాల్ నిబంధనల పేరుతో అధికారులకు అది కష్టతరంగా మారింది.
సమస్యను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతికత ద్వారా తనకున్న సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించేశారు.
అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
సీఎం ఆదేశాలతో భద్రతలో సమూల మార్పులు చేశారు. వైకాపా హయాంలో ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత కల్పించేవారు.
ప్రస్తుతం చంద్రబాబుకు కేవలం 121 మందితో భద్రత కల్పిస్తున్నారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్‌లో 17 వాహనాలు ఉండగా.. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు వాహన శ్రేణి 11 వాహనాలకే పరిమితమైంది.
www.thedesknews.net