ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :
ప్రజల వద్దకే పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమౌతుందని కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని వైవాక గ్రామములో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసరం రెవిన్యూ సిబ్బందిచె నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులో బుధవారం శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఒక మండల మేజిస్ట్రేట్ మరియు అన్ని శాఖల అధికారులు మీ ప్రాంతానికే వచ్చారని.. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులతో వివరించి పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ సదస్సు లో ముఖ్య అంశం మీ భూమి – మీ హక్కు గ్రామ స్థాయిలో భూములను సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవిన్యూ గ్రామాన్ని సందర్శిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అవలంభించిన తిరును ఖండిస్తూ.. భూమి పాస్ బుక్ లపై గత ప్రభుత్వ తాలూకా ఫోటోలు వేయటం అనేది తన జీవితం లో ఎన్నడూ చూడలేదన్నారు.
పాస్ పుస్తకాల పైనే కాకుండా సరిహద్దు రాళ్ల పై కూడా ఫోటోలు, పేర్లు వేపించుకున్న ఘనత గత ప్రభుత్వ పాలకులకే సాధ్ధ్యం అని అన్నారు. ప్రతి పాస్ బుక్కు పై రాజముద్ర తప్ప ఎవరి ఫోటోలు వుండవని.. ఒక నియంతలా పరిపాలన చేద్దాం అనుకున్నాడని.. ప్రజలు ఆధా పాతాలానికి తొక్కి గొప్ప గుణపాఠం చెప్పారన్నారు.
మీ ఆశలు, ఆకాంక్షలు మేరకు ఏర్పాటైనా ప్రభుత్వమే ఇదని.. అందుకే ఇది మంచి ప్రభుత్వం అయ్యిందన్నారు. మీ సమస్యలను పరిష్కార దిశగా తీసుకువెళ్ళటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, రెవిన్యూ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.