The Desk …Aasifabad : తగ్గేదేలే… మళ్లీ మొదలైన ఆవుల అక్రమ రవాణా..!!

The Desk …Aasifabad : తగ్గేదేలే… మళ్లీ మొదలైన ఆవుల అక్రమ రవాణా..!!

  • ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణా…
  • బొలెరో వాహనాలలో తరలింపు…
  • రూటు కూడా మార్పు…

తెలంగాణ : (కొమరం భీం, ఆసిఫాబాద్): THE DESK :

మూగజీవాల అక్రమ రవాణా మళ్ళీ ఊ పండుకుంది.తెలంగాణను కలిపే రహదారి అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన సదరు ఆవుల అక్రమా రవాణా యధావిదిగా కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఐతే ఈ సారి రవాణాలో ట్విస్ట్ ఏమిటంటే .. పెద్ద వాహనాలు పక్కన పెట్టి చిన్న చిన్న బొలెరో వాహనాలతో రవాణా యధావిధి గా నడుస్తున్నది. మహారాష్ట్ర నుండి వాంకిడి సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా నడుస్తున్న ఈ అక్రమ రవాణా కొన్ని సందర్భాల్లో వాంకిడి మీదుగా కాకుండా కొండపై నుండి వాంకిడి సరిహద్దు దాటి పల్లెల నుండి నేషనల్ హైవేకు తరలిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బొలెరో వాహనంలో 10 నుండి 15 జంతువులను కుక్కి రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.అక్రమార్కులు ఎన్ని కేసులైనా, ఎన్నిసార్లు పట్టుబడినా సరికొత్త వాహనాలను ఉపయోగిస్తూ కొత్త కొత్త ప్లాన్లతో అక్రమ రవాణా కొనసాగిస్తునే ఉన్నారు. అధికారులకు అవగాహన లేని వాహనాలతో అక్రమ రవాణా కొనసాగిస్తున్న ఈ కేటుగాళ్లు .., రోజుకు సుమారు 20. నుండి 30 వాహనాల్లో ఆసిఫాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ నిజామాబాద్, సాటాపూర్ కు జీవాలను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అలవోకగా ఆదిలాబాదు మీదుగా…

ఇదిలా ఉండగా.., పెద్ద వాహనాలు, లారీలు, కంటైనర్ లకు కొత్త రూటు ఎంచుకున్నట్లు తెలిసింది. మహారాష్ట్ర బార్డర్ కు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్, నాగపూర్ హైదరాబాద్ హైవే నుండి రోజుకు సుమారు రాత్రికి రాత్రే 40 నుంచి 50 లారీలు కంటైనర్లు ఆదిలాబాద్ హైవే నుండి హైదరాబాద్ కు తరలి వెళ్తున్నాయి. ఆదిలాబాద్ హైవే లోనూ రోజూ రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 10 గంటల వరకు తరలి వెళ్తున్న ఈ మూగజీవాల వాహనాల్లో ఒక్కొక్క వాహనంలో సుమారు 70 నుండి 100 ఆవులను కుక్కి వెళ్తున్నట్టు సమాచారం.

ఆర్టీఓ చెక్ పోస్టులపై ఆరోపణలు…..

తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ లో గల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఆర్టీఓ చెక్ పోస్టులకు ఒక్కో బండికి సుమారు పది వేల నుండి పదిహేను వేల రూపాయలు మామూలు చెల్లిస్తున్నట్టు సమాచారం‌. ఆయా చెక్ పోస్టులు దాటుకుని సదరు వాహనాలు అదే దారిలో విశ్వహిందు,భజరంగ్ దళ్,అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడటమే పై ఆరోపణలకు ఊతమిస్తోంది. కాగా ఆదిలాబాద్ నుండి వెళ్తున్న వాహనాలను స్థానిక పోలీసులు తనిఖీలు చేసి, చర్యలు చేపడితే అక్కడి అక్రమ రవాణా సైతం అరికట్టవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.