The Desk… Kaikaluru : ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం : అవగాహన సదస్సులో రూరల్ సీఐ వి రవికుమార్ వెల్లడి

The Desk… Kaikaluru : ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం : అవగాహన సదస్సులో రూరల్ సీఐ వి రవికుమార్ వెల్లడి

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK:

ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆదేశాలపై కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్, Mandavalli పోలీస్ స్టేషన్ పరిధిలోని మరియు Kaikalur Rural పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ప్రజలకు సీసీ కెమెరాల వలన ఉపయోగాలపై అవగాహన సదస్సులను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సీసీ కెమెరాలు ఉంటే కలిగే లాభాలను గురించి వివరిస్తూ.. ఒక సీసీ కెమెరా ఒక ఏరియాలో ఉంది అంటే.. పదిమంది పోలీస్ ల నిఘా ఉన్నట్లే అన్నారు.

సీసీ కెమెరాల అమరిక మన ఇంటి వైపు కాకుండా వీధి వైపు కవరయ్యేలగా ఏర్పాటు చేసుకోవాలని.. దాని వలన ఏదైనా కేసు దర్యాప్తులో చాలా ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని సీసీ కెమెరా అందిస్తుందని తెలిపారు.

ఆధునిక సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నట్లు సమయం కాని సమయంలో అపరిచితులు మన ఇంటి చుట్టుపక్కల సంచరించిన సమయంలో మనకు మన ఫోనుకు అలారం సౌండ్ ను అంద చేస్తుందన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే ప్రజలు దాని యొక్క వైఫై కనెక్షన్ ను పోలీస్ స్టేషన్ లకు అనుసంధానం చేస్తే పోలీసు వారి యొక్క పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు.

అతి తక్కువ రేట్లకు వచ్చేటటు వంటి సీసీ కెమెరాలు పబ్లిక్ లో అందుబాటులో ఉన్నాయన్నారు.

వాటి వివరాలు…

  1. సింగిల్ కెమెరా: ₹2100/-
    ఒక నెల బ్యాకప్
    ప్రస్తుత కనెక్షన్
  2. సింగిల్ కెమెరా: ₹4500/-
    వైఫై కనెక్షన్
    ఐపీ కెమెరా
    ఒక నెల బ్యాకప్
    360 డిగ్రీలు
    నైట్ విజన్
    వాయిస్ రికార్డింగ్
  3. సోలార్ సింగిల్ కెమెరా: ₹6400/-
    పవర్ లేకుండా
    ఒక నెల బ్యాకప్
  4. 4 కెమెరాలు: ₹16,000/-
    ఒక నెల బ్యాకప్
    డీవీఆర్‌తో
  5. 4 కెమెరాలు: ₹25,000/-
    ఐపీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని.. ఈ కెమెరాల యొక్క విలువ ప్రజల పోగొట్టుకునే వాటికంటే ఎంతో తక్కువ రేట్ లో అందుబాటులో ఉంటున్నట్లు అటువంటి వాటిని అమర్చుకోవాలని..,
    ఏదైనా నేరం జరిగిన తర్వాత బాధపడే కంటే నేరాలు జరగకుండా కాపాడుకోవాలంటే
    సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణ అవసరమని ప్రజలకు సీసీ కెమెరాలు యొక్క ఉపయోగాలను గురించి తెలియజేసిన కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, Mandavalli ఎస్ఐ Ramachandra Rao, Kaikalur Rural ఎస్సై Rambabu మరియు పోలీసు అధికారులు.