The Desk…Delhi : రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి సహకరించండి : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ విజ్ఞప్తి

The Desk…Delhi : రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి సహకరించండి : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ విజ్ఞప్తి

  • కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేత..

దిల్లీ/ ఏలూరు : THE DESK :

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీ రైల్ భవన్లో మంగళవారం జరిగిన సమావేశం సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మంత్రికి వినతి పత్రాలు అందజేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ గుడివాడ జంక్షన్, నూజివీడు, మధిర మీదుగా నూజివీడు పట్టణం, విస్సన్నపేట మధ్య కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని, 96 కి.మీ పొడవైన ఈ లైన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ముఖ్యమైన లింక్‌గా ఉపయోగపడుతుందని, మచిలీపట్నం పోర్ట్, ఇండియా కోల్ ఫీల్డ్స్ (నూజివీడు అసెంబ్లీలో ఓపెన్ కాస్ట్), కొత్త ఏపీఎస్ఐఐడీసీ సెజ్ (APSIIDC SEZ) నుండి తలెత్తే ట్రాఫిక్ సమస్య అధిగమించడం కోసం ఈ రైల్వే లైన్ దోహదం చేస్తుందని, ఆక్వా ఫీడ్ కంపెనీలు, మామిడి మరియు మామిడి ఉత్పత్తుల ఎగుమతి, వరి తృణధాన్యాలు వంటి అనేక వ్యవసాయ ఉత్పత్తులు, చేపలు, ఆక్వా అవసరాలు వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున రాబోయే సాధారణ బడ్జెట్ 2025లో కొత్త రైల్వే లైన్ మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

నూజివీడు రైల్వే స్టేషన్‌ ఆధునీకరణలో భాగంగా ప్రయాణికుల వెయిటింగ్ రూమ్, జనరల్ వెయిటింగ్ హాల్, డిప్యూటీ ఎస్ ఎస్ గది, వెయిటింగ్ లాంజ్, ప్లాట్‌ఫారమ్ 1లో 4 ప్యాసింజర్ షెడ్లు (60×8 మీటర్లు), ప్లాట్‌ఫారమ్ 2లో 4 ప్యాసింజర్ షెడ్లు (60×8 మీటర్లు), ప్లాట్‌ఫారమ్- 1, 2కి ఇరువైపులా అప్రోచ్ రోడ్ (7 మీటర్లు), ప్లాట్‌ఫారమ్- 1, 2లో మరుగుదొడ్ల నిర్మాణం, ప్లాట్‌ఫారమ్‌లు- 1, 2లో లిఫ్ట్‌ల ఇన్‌స్టాలేషన్, కూర్చునే బెంచీలు, ప్లాట్‌ఫారమ్ 2లో 24 గంటల టిక్కెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీ విన్నవించారు.

నూజివీడు ప్రాంత ప్రజలు విశాఖపట్నం, హైదరాబాద్, వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీలుగా నూజివీడు రైల్వేస్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్ (Trn.No.18045 మరియు 18046)ని నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

సత్తుపల్లి మీదుగా భద్రాచలం-కొవ్వూరు బ్రాడ్ గేజ్ మార్గాన్ని మంజూరు చేయాలని, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 50% వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రైల్వేలైన్ ప్రతిపాదించారని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ఈ రైల్వే లైన్ వల్ల విశాఖపట్నం- హైదరాబాద్‌ల మధ్య దూరం 150 కిలోమీటర్ల మేర తగ్గుతుంది, నాలుగు ఎస్సి, మూడు ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తుందని, ఈ రైల్వే లైన్ మంజూరులో నెలకొన్న జాప్యం వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ప్రతి ఏటా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో డిపిఆర్ సవరించడానికి ఉత్తర్వులు జారీ చేస్తూ, కొత్త రైల్వే లైన్ వేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు పరిశీలించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

హాల్ట్ పునరుద్ధరించాలి…

కైకలూరు మండలం పల్లెవాడ రైల్వేస్టేషన్‌లో 17269/70, 17281/82 నంబర్ గల రైళ్లకు హాల్ట్ నిలిపివేయడం వల్ల సమీప గ్రామాలైన ఆలపాడు, భుజబలపట్నం, రామవరం, నర్సపాలెం, పెంచికలమర్రు, తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మళ్లీ హాల్ట్ పునరుద్ధరించాలని ఎంపీ అభ్యర్థించారు.

ద్వారకా తిరుమలకు వచ్చే భక్తుల ప్రయోజనాల దృష్ట్యా రాయగడ, తిరుపతి-కాకినాడ ప్యాసింజర్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను చేబ్రోలు రైల్వే స్టేషన్‌లో నిలపాలని, నూజివీడు రైల్వే స్టేషన్‌లో రైలు నెం. 12737-గౌతమి ఎక్స్‌ప్రెస్, 12727-గోదావరి ఎక్స్‌ప్రెస్, 12868-విశాఖపట్నం నుండి మహబూబ్ నగర్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను హాల్ట్ చేయాలని,

అత్తిలి రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ మరియు పాత ప్యాసింజర్ రైళ్లను రాజమండ్రి వైపు నడపాలని.. 17282-NSP-GNT ఎక్స్‌ప్రెస్, రైలు నం.17269 NSP-BZA, 17270-NSP ఎక్స్‌ప్రెస్ విజయవాడ JN, గుడివాడ JN, గుంటూరు JN మరియు నరసాపురం జంక్షన్ నుండి నడుస్తున్న ఈ రైళ్లను మొఖసకలవపూడిలో ఆపాలని.. చేబ్రోలు రైల్వే స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, పైన పేర్కొన్న రైళ్లకు చేబ్రోలు, నూజివీడు, అత్తిలి, మొఖసకలవపూడి వద్ద హాల్ట్ అందించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రిని కోరారు.