The Desk…Paderu : మినుములూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

The Desk…Paderu : మినుములూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

  • చెట్టు కిందనే గిరిజనులతో మంత్రి సమావేశం..

అల్లూరి సీతారామరాజు జిల్లా : పాడేరు : THE DESK :

పాడేరు మండలంలోని మినుములూరు గ్రామంలో స్థానిక సచివాలయాన్ని మంగళవారం గృహ నిర్మాణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, సభ కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడంతో చెట్టు నీడలో కుర్చీలు ఏర్పాటు చేసి గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో గిరిజనులు తమ సమస్యలను మంత్రికి వివరించారు.

తాగునీరు అందించాలని, రహదారులు మెరుగుపరచాలని, కాఫీ తోటల్లో కూలి పనులు తప్ప మరో ఉపాధి మార్గాలు లేకపోవడం, ఉపాధి హామీ పథకం క్రింద మరిన్ని పనులు కల్పించాలని.. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని కోరారు.

అదేవిధంగా డి.ఆర్ డిపో ద్వారా రేషన్ తో పాటు నిత్యవసరసరుకులు అందించాలని కోరారు. అంతేకాకుండా, తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విన్నవించారు.

ఈ అభ్యర్థనలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. గ్రామ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశం గిరిజన ప్రజలతో మంత్రి నేరుగా మమేకమయ్యే విధానానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది.