The Desk…Kaikaluru : శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి : మంత్రి పార్థసారధి

The Desk…Kaikaluru : శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి : మంత్రి పార్థసారధి

  • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కొలుసు పార్థసారధి లక్ష్మీ కమల దంపతులు

ఏలూరు జిల్లా : కైకలూరు: THE DESK :

శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరి పై మెండుగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆకాంక్షించారు. కైకలూరు కొల్లేటికోటలో వెంచివున్న శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారిని కొలుసు పార్ధసారధి లక్ష్మి కమల దంపతులు దర్శించుకున్నారు. వేద మంత్రాలతో బాజా భజంత్రీ లతో మొదటగా మంత్రి దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. పిదప మంత్రి కొలుసు పార్ధసారధి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వారిని ఆలయ వేద పండితులు దుశ్శాలువతో ఘనంగా సన్మానించి వేదాసేర్వచనం చేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు.

కైకలూరు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ,రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.పెద్దింట్లమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలోని, జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు ప్రజలు సహకరించాలన్నారు.

కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అయిన పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పాడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందాలన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అంత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు, గ్రామ పెద్దలు అమ్మవారి ఆశీసులు పొందారు.