ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్పూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు రోడ్ లో గల పార్టీ కార్యాలయం వద్ద అంబేడ్కర్ 68వ వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఆయన స్పూర్తిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అమలుపర్చారన్నారు.
అనంతరం దళితుల సంక్షేమానికి ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశేష కృషి చేశారన్నారు. వైఎస్ జగన్ నవరత్నాలతో పాటు మరో 23 రత్నాల పథకాలను సచివాలయాల్లో అమలు చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతోన్నారన్నారు. అంబేడ్కర్ జీవించి ఉంటే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పావరన్నారు.
రాష్ట్రంలో ప్రజలు పడుతోన్నా ఇబ్బందులను చూసి ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జనవరి చివరి వారం నుంచి ప్రజల మద్యకు వస్తున్నారన్నారు. బియ్యం మద్దతు ధర, కరెంటు చార్జీల పెంపు వంటి అంశాలపై దశలవారి ఆందోళనలు ఉంటాయన్నారు. జనవరి 13న రైతు సమస్యలపై ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రైతులందరితో కలసి వినతిపత్రం అందిస్తామన్నారు.
కార్యక్రమంలో వీరితోపాటు జిల్లా బీసీ నాయకులు బలే నాగరాజు, పల్లెవాడ ఎంపీటీసీ సాదు కొండయ్య, ఆటపాక ఎంపీటీసీ పట్టపు బాలమ్మ, మండల కో ఆప్షన్ సభ్యులు సోమల శ్యాంసుందర్, కైకలూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు ఉచ్చుల చిన్ని రాజు షేక్ రఫీ, పంజా రామారావు, కూర్మ నెహెమ్యా,మూడేళ్ల గౌరీ నాయుడు, మండవిల్లి మండల ex.ఎంపీపీ ముంగర గోపాలకృష్ణ, ఈదా మురళి, బోడావుల అప్పయ్య, జాజుల రాజు, బోడావుల మల్లీ, బోడావుల నాగరాజు, బూరుపోయిన మోహన్ రావు,బుర్ల భోగేశ్వరరావు, కరేటి రాంబాబు, సమయం అంజిబాబు, పంజా నాగు, సలాది నాగరాజు, జంగం విజయ్ బాబు, బేతాళ కోటేశ్వరరావు, కన్నా రమేష్, పిచ్చేటి పెద్దిరాజు, బొర్ల కిరణ్, నవుడు సాంబశివరావు, ఆకునూరి జాన్సన్, తోట మాధవ, కొణిజేటి రవి, బిరుదుగడ్డ లాజరు, పెంటా అనిల్, అల్లాడ పూర్ణ, బుసనబోయిన శ్రీను, బండ్రపల్లి సుధాకర్, కూనవరపు రాజశేఖర్, రేగిశెట్టి రాము, మంతెనపల్లి జాషువా, ఫిర్దోస్ ఖాన్, కోట పవన్,గొల్లపల్లి చిన్ని, షేక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.