ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు మండలంలోని గోపవరంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్రావు తో కలిసి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని మాట్లాడుతూ…భారతదేశానికి అంబేడ్కర్ దిక్సూచి అని, వివక్షకు గురైన అణగారిన వర్గాలను ఉన్నత స్థితిలో నిలిపిన మహెూన్నత శక్తి అని అన్నారు.
అంబేద్కర్ ఒక జాతికి వర్గానికి చెందిన వ్యక్తి కాదని.. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక న్యాయంతో సామాజిక అసమానతలు లేని భారతదేశాన్ని నిర్మించడం కోసం రాజ్యాంగాన్ని లిఖించారని పేర్కొన్నారు. ప్రపంచమే గుర్తించిన మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్డీఎ కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.