The Desk… Kalidindi : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళులు

The Desk… Kalidindi : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళులు

ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK :

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

శుక్రవారం మండలంలోని వెంకటాపురం కాలనీ లో అంబేద్కర్ విగ్రహానికి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు – కూరేళ్ల ఏడుకొండలు, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బళ్ళ రాజు, దాసరి అబ్రహం లింకన్, ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు.

కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లంక. రత్నరావు, నున్న. సుధాకర్, గొల్ల. ప్రేమ్ కుమార్, దాసు, సుబ్బారావు, ఈద. దుర్గారావు, జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.