- విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
- పవర్ పేట ఎంసి యు పి స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు జిల్లా : ఏలూరు పవర్ పేట : THE DESK :
మధ్యాహ్న భోజనం మెనూ ని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పవర్ పేట ఎంసి యు పి స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్న భోజనంలో మెనూను ఖచ్చితంగా పాటించాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన సరుకులను వాడాలన్నారు. సరుకులతో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటానన్నారు.
అనంతరం మధ్యాహ్న భోజన పధకాన్ని రుచిచూసి, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మధ్యాహ్న భోజన పధకానికి వినియోగించే సరుకుల స్టోర్ ను కలెక్టర్ పరిశీలించారు.
సరుకుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి వివరాలను ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండన్స్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, నగరపాలక సంస్థ ఉప కమీషనర్ చంద్రయ్య, ఎం ఈ ఓ లు రంగారావు, రవిప్రకాష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీహరి తదితరులు ఉన్నారు.