The Desk…Kaikaluru : కన్నుల పండువగా శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

The Desk…Kaikaluru : కన్నుల పండువగా శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ఏలూరు జిల్లా: కైకలూరు : THE DESK :

స్థానిక శ్రీ సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. కైకలూరు స్వాంప్ డ్రెయిన్ కాలువ గట్టుపై వెలసిన శ్రీ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభమైన విషయం విధితమే.

దీనిలో భాగంగా బుధవారం శ్రీ గణపతి, శ్రీ నాగబంద, శ్రీ మయూర వాహన సహిత శ్రీ సంతాన నాగేంద్ర, శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ శిష్య బృందం గణపతి శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ముందుగా నిర్వహించిన వివిధ హోమాల పూర్ణాహుతి.. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దివ్య శాంతి కల్యాణం జరుగగా.. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు చావలి శంకర్ శాస్త్రి ఆధ్వర్యంలో చేపట్టారు. పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎం. శివకిరణ్, న్యాయవాదులు గురజాడ ఉదయ శంకర్, వడ్లాని శ్రీరామచంద్రమూర్తి, పి.పవన్ కాంత్, శ్రీ రామలింగేశ్వర స్వామి ధర్మకర్త ఉప్పులూరి ముత్తం రాజు శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పండ్రంగి కనకదుర్గ ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.