The Desk…kokkirayilanka : నా భూమి నాకు ఇప్పించండి మహాప్రభో… ఓ రైతు ఆవేదన..!!

The Desk…kokkirayilanka : నా భూమి నాకు ఇప్పించండి మహాప్రభో… ఓ రైతు ఆవేదన..!!

  • కొక్కిరాయిలంకలో వైసీపీ నేత అక్రమ భూ దందా
  • కామేష్ అనే వ్యక్తి తో పాటు కొంతమంది గ్రామ పెద్దల పాత్ర
  • ఏలూరులో రిజిస్ట్రేషన్ చేయించకుండా కృష్ణాజిల్లా మొవ్వ లో చేయించవలసిన అవసరమేంటి..?
  • బాధిత రైతు ఆవేదన

ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : కొక్కిరాయిలంక : THE DESK :

వైసిపి భూ కబ్జాదారులు అధికారులతో కొమ్మక్కై కొంతమంది గ్రామ పెద్దలను కలుపుకుని తనకు పక్కా రికార్డు లు ఉన్న భూమిని ఆక్రమించారని బాధిత రైతు దంతులూరి ఆనందరాజు గురువారం మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు.

దెందులూరం నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం కొక్కిరాయిలంక గ్రామంలో ని దంతులూరి ఆనందరాజు 1991 నుండి 2016 వరకు పోరాటం చేయాగా.. సుప్రీం కోర్టు తనకు 22 ఎకరాల 72 సెంట్లకు 21ఎకరాల 7 సెంట్లు స్వాదీనం చేశారన్నారు.

అయితే.. కొక్కిరాయి లంక గ్రామానికి చెందిన మేషేతో పాటు కామేష్ , గ్రామ పెద్దలు అక్రమంగా ఇరు వర్గాలు లేకుండా అధికారులు సర్వే చేసి తమ భూమిని కొలతలు వేసి తన 22 ఎకరాల 72 గంటలకు గాను 18 ఎకరాల 90 సెంట్లు చూపించారని.. మిగిలిన భూమిని కబ్జా చేశారన్నారు.

సర్వేలో అక్రమం జరగకపోతే వాళ్లు ఏలూరు రూరల్ మండలానికి సంబంధించిన ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేయకుండా విజయవాడ లో రిజిస్ట్రేషన్ చేయించవల్సిన అవసరం ఎంటో తెలపాలన్నారు.

న్యాయ పరంగా సకల హక్కులు కలిగివున్నా.. అక్రమ చొరబాటుతో గత కొంతకాలంగా ఆర్థికంగా నష్టపోయానని వాపోయారు. అలాగే సివిల్ వివాదాలలోకి పోలీసుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు. తనను మనోవ్యధకు గురిచేసి ఆర్థికపరంగా కృంగదీసిన సంబంధిత అధికారులపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు.