ఏలూరు జిల్లా : ముదినేపల్లి / మండవల్లి : THE DESK :
తుఫాను భయంతో కంగారుపడి రైతులేవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దని.. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు. మండవల్లి, ముదినేపల్లి మండలాలలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జేసీ సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జేసీ పరీలించారు.
ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. వాతావరణశాఖ చేత జారీచేయబడిన తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో ఇప్పటికే సూర్చబడిన ధాన్యం కొనుగోలు, రవాణా చేయుటకు ఇప్పటికి తగినన్ని గోనెసంచులు రవాణా వాహనములతో సహా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ను ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధముగా ఉందన్నారు.
రాగల తుఫాను ప్రభావము జిల్లాలో కేవలం పోలవరం, ముదినేపల్లి, కైకలూరు, కలిదిండి మండలాల పై మాత్రమే పాక్షిక ప్రభావం ఉంటుందని, అందుకు తగిన విధంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుందని, కావున రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జేసీ రైతులకు విజ్ఞపి చేశారు.
అనంతరం ముదినేపల్లి మండలం వడాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రక్రియను అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాన్ని జేసీ పరిశీలించారుజేసీ వెంట పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.