ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
సంఘీయులంతా సంఘటితంగా ఉండాలని, అన్నింటా కలిసి ముందుకుసాగాలని వక్తలు పిలుపునిచ్చారు.
మంగళవారం మండవల్లి మండలం, లోకుమూడిగరువులోని దత్తాశ్రమంలో నాయీ బ్రాహ్మణ నియోజకవర్గ స్థాయి కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, సంఘీయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు.
కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు, నాయిబ్రాహ్మణ సంఘ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. సదాశివం, రాష్ట్ర డైరెక్టర్లు లంకా రత్నారావు, ఎస్, నాగరాజు, రాష్ట్ర సేవా సంఘం అధికార ప్రతినిధి పెద్దహాపు సత్యనారాయణ, ఉ మ్మడి జిల్లా అధ్యక్షుడు తురాయి శ్రీను, సాధికార సమితి అధ్యక్షుడు కె. నాగరాజు, సేవా సంఘం అధ్యక్షడు కె. వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి విజయ్ కుమార్ తదితరులు కార్తీక వనసమారాధనలో పాల్గొని సమారాధన విశిష్టితను, 75 సంవత్సరాలు పూర్తయిన భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు.
అలాగే, ద్వారకా తిరుమల బస్టాండ్‌కు సమీపంలో నాయి బ్రాహ్మణ కళ్యాణమండపం ఏర్పాటుకు 50 సెంట్లు స్థలాన్ని ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ కేటాయించటం పట్ల సంఘీయులంతా హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో బీసీ సంఘాల ఉమ్మడి జిల్లా అద్యక్షుడు వర్ధనపల్లికాశీ, నాయిబ్రాహ్మణ సంఘం ప్రజాప్రతినిధులు, పెద్దలు, సంఘీయులు, సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని వనసమారాధనను విజయవంతం చేశారు.