The Desk…Mandavalli : గన్నవరంలో జంట హత్యలు..!!

The Desk…Mandavalli : గన్నవరంలో జంట హత్యలు..!!

ఏలూరు జిల్లా : మండవల్లి : THE DESK :

మండలంలోని గన్నవరం గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇరువురు దారుణ హత్యకు గురయ్యారు. హతులు తల్లి భ్రమరాంబ (60), కుమారుడు ఐ టిడిపీ సభ్యుడు సురేష్ (32) గా తెలియవచ్చింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నిరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో హత్య జరిగిన ప్రదేశంలో నమూనాలను సేకరించి దర్యాప్తు నిమిత్తం ల్యాబ్ కు పంపారు.

డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…

ఆస్తి తగాదాల నేపథ్యంలో మొదటి భార్య కుమారుడు కు, హతుడు సురేష్ కు ఇటీవల పెద్ద మనుషుల వద్ద ఒప్పందం జరిగిందన్నారు. కోర్టును కూడా ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఆస్తంతా తనకే దక్కాలనే అత్యాశతోనే ఈ దారుణానికి వడిగట్టి ఉంటాడేమోనని.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అభిప్రాయపడుతున్నామన్నారు. తదుపరి దర్యాప్తులో హత్యలకు గల కారణాలు తేలుతాయన్నారు.

ఈ ప్రాథమిక దర్యాప్తులో కైకలూరు రూరల్ సీఐ రవికుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, మండవల్లి ch. రామచంద్ర రావు, కలిదిండి ఎస్ఐ, కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.