ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
డ్రైవింగ్ లైసెన్స్ ల కొరకు దళారులను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని ఏలూరు జిల్లా ఉప రవాణా కమీషనరు కరీమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దళారుల వ్యవస్ధ నిర్మూలించి రవాణా శాఖ సేవలను పౌరులకు మరింత చేరువచేసే ఉద్ధేశ్యంతో 2018వ సంవత్సరంలోనే ప్రభుత్వం లెర్నింగ్ లైసెన్స్, ఏఫ్డిఎల్, ఎఫ్సీ, పర్మింట్ తదితర 83 సేవలను ఆన్ లైన్ విధానంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఈ విధానం ద్వారా పౌరులు సిఎస్ సి సెంటర్లు మరియు ఇ- సేవల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రుసుం మాత్రమే చెల్లించి రవాణా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ సమయంలో సరైన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని వాటిని కార్యాలయ సిబ్బంది వారి విధుల్లో భాగంగా పరిశీలించి అప్రూవల్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. అదే సమయంలో సరైన పత్రాలు లేని దస్రాన్ని తిరస్కరించబడటం జరుగుతుందని తెలిపారు.
వాహనాలకు సంబంధించి www.vahan.parivahan.gov.in మరియు డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి www.sarathi.parivahan.gov.in వెబ్ సైట్ల ద్వారా తమయొక్క మొబైల్ ఫోన్, కంప్యూటర్లను వినియోగించుకొని పౌరులు రవాణా సేవలు పొందవచ్చన్నారు.
అవగాహన లేనివారికి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌర సమాచారం కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నామని ఎవరికైనా రవాణా సేవలను పొందుటలో ఇబ్బందులు కలిగిన ఎడల ఆర్టీవో లేదా డిటిసి మొబైల్ ఫోన్ నెంబర్లకు (9154294210, 9154294105) పోన్ చేసి కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చన్నారు.
లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో 10 నిమిషాల సమయంలో 20 ప్రశ్నలలో 12 వాటికి సరైన సమాధానం ఇచ్చిన వారు ఉత్తీర్ణులు అవుతారని.. నెలరోజుల తర్వాత ఆన్ లైన్ లో రుసుము చెల్లించి వాహనంతో టెస్ట్ ట్రాక్ కు వెళ్లి పర్మినెంట్ లైసెన్స్ లు పొందవచ్చని.. డ్రైవింగ్ లైసెన్స్ ల కొరకు దళారులను ఆశ్రయించవద్దని ఆయన తెలిపారు.