ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
దొంగలించిన 251 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేయటం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియడారు.
ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షనీయమన్నారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు.
నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన స్కూటర్ గతంలో చోరీకి గురైంది. బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు అన్నారు.
ఈ మేరకు ఏపీ పోలీసు శాఖ ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియోను చంద్రబాబు రీట్వీట్ చేశారు. రోజువారీ రవాణా, జీవనోపాధికి వాడే వాహనాలు చోరీకి గురైతే ఆయా కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతాయన్నారు.