The Desk…Amalapuram : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి..!

The Desk…Amalapuram : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి..!

డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా : అమలాపురం : THE DESK :

కెనడాకు చెందిన యువతిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు వైకుంఠపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడా దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆ దేశానికి చెందిన సహోద్యోగి ట్రేసీ రోచేదాన్ అతడికి పరిచయమైంది. ఇరువురి అభిప్రాయాలు మనసులు కలిసాయి.

ఈపరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కెనడా దేశంలో వధువు రోచేడాన్ తో ఇటీవల వివాహమైంది.

అమలాపురానికి వచ్చిన ఆ జంట భారతీయ హిందూ ప్రకారం త్వరలో పెళ్లి చేసుకునేందుకు సోమవారం నుంచి సన్నాహాలు మొదలు పెట్టారు. బంధుమిత్రులతో ఆ ఇంట పెళ్లి సందడి నెలకొంది.