గుంటూరు జిల్లా : మంగళగిరి : THE DESK :
సరైన అనుమతులు సంరక్షణ లేకుండా గోవులను అక్రమంగా తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ హెచ్చరించారు.
ఆదివారం తెల్లవారుజామున మంగళగిరి జాతీయ రహదారిపై ఎటువంటి సంరక్షణ లేకుండా ఇబ్బందికరంగా తరలిస్తున్న గోవులను మంగళగిరి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాటిని సంరక్షణ నిమిత్తం పట్టణానికి చెందిన నరసింహ స్వామి ఆలయ గోశాలకు తరలించారు.
గోవుల సంరక్షణకు అంగీకరించిన గోశాల నిర్వాహకులకు ఎస్సై కృతజ్ఞతలు తెలిపారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న నైట్ డ్యూటీ లో ఉన్న హోంగార్డ్ బుజ్జిని ఎస్సై వెంకట్ అభినందించారు. గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులను పలువురు అభినందించారు.