The Desk…Eluru : దీపావళి రోజున విషాదం..‼️

The Desk…Eluru : దీపావళి రోజున విషాదం..‼️

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

రోడ్డుపై గుంత కారణంగా ఉల్లిపాయ బాంబులు పేలి ఒకరు మృతి

సుధాకర్ అనే వ్యక్తి బైక్ పై ఉల్లిపాయ బాంబుల బస్తా పట్టుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్ పైనుంచి బస్తా కిందపడింది. దీంతో పేలుడు జరిగింది.

ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.