The Desk… Kalidindi : మనస్థాపానికి గురై 10వ తరగతి విద్యార్థిని మృతి

The Desk… Kalidindi : మనస్థాపానికి గురై 10వ తరగతి విద్యార్థిని మృతి

ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK :

జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించిన విద్యార్థిని వెన్నెల

స్కూల్ యాజమాన్యం బెదిరింపులు భరించలేక మృతి

విద్యార్థిని మృతికి కారణమైన స్కూలు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి : కాళ్లపాలెం బుజ్జి డిమాండ్

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం లోని చిలకలపాడు గ్రామనికి చెందిన చెక్కపల్లి బాబీ ( ఫోటోగ్రఫీ) కూతురు చెక్కపల్లి వెన్నెల చెముడులంక గ్రామములో ఓ ప్రైవేట్ స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్నది, దసరా సెలవలు ఇవ్వటం లేదని.. తన తండ్రి ఫోన్ నుండి డా. బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఫోన్ కి తన చదువుకుంటున్న స్కూల్ దసరా సెలవులివ్వటం లేదని తెలిపింది. కలెక్టర్కు సమాచారం ఇచ్చినందుకు స్కూల్ డైరెక్టర్ విద్యార్థిని వెన్నెలను టార్చర్ చెయ్యడం వల్ల మనస్తాపానికి గురై ఈనెల 17న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది…

ఇక పై భవిష్యత్తులో ఏ విద్యార్ధి కి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పన్నాస పూర్ణ చంద్రరావు ( కాళ్లపాలెం బుజ్జి) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ.. ధయచేసి తల్లిదండ్రులు అందరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినదిగా కోరారు.

వెన్నెల 10వ తరగతి పాస్ కాకండా చేస్తానని యాజమాన్యం భయపెట్టడం వల్లే వెన్నెల మనస్తాపంతో చనిపోయిందని.. ప్రభుత్వ పాఠశాలలో సెలవులు ఎలా ఉంటాయో.. ప్రవేటు పాఠశాలలో కూడా అలానే సెలవు లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. 24గంటలలో విద్యాసంస్థపై కఠిన చర్య తీసుకోని వారిని శిక్షించలని డిమాండ్ చేశారు. వెన్నెల తండ్రి బాబీని ఓదార్చే మీకు మేము అండగా ఉంటామని బుజ్జి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూరెళ్ల కళ్యాణ్, బొడ్డు అజయ్, పవన్ కళ్యాణ్, భవాని, రాజు, దాసరి క్రాంతి పాల్గొన్నారు.